calender_icon.png 6 December, 2024 | 3:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళారులను నమ్మి మోసపోకండి

07-11-2024 03:21:55 PM

ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోపే రైతు ఖాతాలో డబ్బులు 

సన్నవడ్లకు ప్రతి క్వింటాలుకు రూ. 500 బోనస్

లాభాల బాట పట్టింది తెలంగాణ వ్యవసాయం.. ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ఎంతో శ్రమించి పండించిన వరి ధాన్యమును ఎట్టి పరిస్థితుల్లో దళారులను నమ్మి మోసపోకూడదని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం హన్వాడ మండలంలోని బుద్ధారం, వేపూరు గ్రామాలలోని రైతు వేదికల దగ్గర వరి కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో ఎమ్మెల్యే మాట్లాడారు. లాభాల బాట పట్టింది తెలంగాణ వ్యవసాయం అన్నారు. భూమిని నమ్ముకుని జీవనం సాగిస్తూ, అందరికీ అన్నం పెట్టే కడుపు నింపే రైతు క్షేమంగా ఉండాలని ప్రజా ప్రభుత్వం కోరుకున్నదని, రైతులను రుణ విముక్తులను చేసిందని స్పష్టం చేశారు. రైతు సంతోషంగా ఉన్నప్పుడే సమాజం సంతోషంగా ఉంటుందని తెలిపారు. రైతు పండించిన పంట కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతు ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

రైతులకు మేలు చేయాలనే చిత్తశుద్ది మా ప్రభుత్వానికి ఉంది కాబట్టి వారికి మద్దతు ధర కల్పించడంతో పాటు సన్న వడ్ల కు రూ. 50 బోనస్ అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రంలో దాన్యం అమ్ముకునే సౌలభ్యం కల్పించామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి రాత్రి పగలు శ్రమించి ప్రజలకు మంచి చేయాలని తపనతో శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. సమగ్ర కుటుంబ సర్వేను ఎమ్మెల్యే బుద్ధారం గ్రామంలో ప్రత్యేకంగా పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, సుధాకర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి మహేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రామకృష్ణ, అచ్చన్న, వెంకటాద్రి, నాయకులు యాదవ రెడ్డి, నవనీత, రఘు, శ్రీనివాస్ రెడ్డి, నర్సింహులు, రవి, బొట్టు శీను, ఖాజా పాషా, సుబ్బా రెడ్డి, వెంకటయ్య, అంజిలయ్య, లక్ష్మారెడ్డి, పెంట్యా నాయక్, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.