calender_icon.png 31 July, 2025 | 11:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి విద్యార్థి న్యాయ శాస్త్రం పై అవగాహన ఉండాలి

30-07-2025 03:54:05 PM

జూనియర్ సివిల్ జడ్జి కసమాల సాయికిరణ్

లక్షెట్టిపేట,(విజయక్రాంతి): ప్రతి విద్యార్థి న్యాయ శాస్త్రంపై అవగాహన కలిగి ఉండాలి. జూనియర్ సివిల్ జడ్జి కసమాల సాయికిరణ్ అన్నారు. బుధవారం గురుకుల పాఠశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు జూనియర్ సివిల్ జడ్జి కసమాల సాయికిరణ్ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి కసమాల సాయికిరణ్ మాట్లాడుతూ.... విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని విద్యలో రాణించి సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించలని అన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల గురించి తెలుసుకొని బాధ్యతతో నడుచుకుంటూ సమాజంలో మంచి పౌరులుగా రాణించాలన్నారు.