calender_icon.png 19 February, 2026 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పథకాల ప్రయోజనాలకు మధ్యవర్తులను ఆశ్రయించొద్దు: ఎమ్మెల్యే జారె

19-02-2026 12:36:12 AM

సత్తుపల్లి, ఫిబ్రవరి 18 (విజయ క్రాంతి): కల్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద మంజూరైన చెక్కులను గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో దమ్మపేట మండలానికి చెందిన అర్హులైన లబ్ధిదారులకు గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణచేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ పేద మరియు మధ్యతరగతి కుటుంబాల అమ్మాయిల పెళ్లిళ్లకు ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం ఎంతో ఉపయోగమని తెలిపారు.

అర్హత కలిగిన ప్రతి కుటుంబం  ప్రభుత్వ పథకాల ప్రయోజనాన్ని పొందాలని ఎవరూ మధ్యవర్తుల మాటలు వినకుండా నేరుగా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు దమ్మపేట మండలంలో ప్రతి గ్రామానికి అభివృద్ధి సంక్షేమం చేరేలా తాను కృషి చేస్తున్నానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో దమ్మపేట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వాసం రాణి  ఎమ్మార్వో రామ్ నరేష్  ఆర్‌ఐలు సోయం బిక్షమయ్య  వంకా వీరస్వామి జూనియర్ అసిస్టెంట్ ఎస్ డి అలీ  జలీల్ పాషా  కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు.