3 April, 2026 | 2:32 AM

సరదా కోసం ప్రాణాలు పణంగా పెట్టొద్దు

03-04-2026 12:39 AM

ఖైరతాబాద్,ఏప్రిల్2 (విజయక్రాంతి): గత నెల మార్చి 29 అర్ధరాత్రి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ సమీపంలో ఒకే బ్పై ఐదుగురు యువకులు అత్యంత ప్రమాదకర రీతిలో ప్రయాణించి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకున్నామని సైఫాబాద్ ఎస్హెచ్‌ఓ సీతయ్య తెలిపారు.ఈ విషయమై ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేపట్టామన్నారు.

వడ్డీ అర్జున్, అరుపు రోహి త్, చింతకుంట అంజ కుమార్, సిద్ధం కౌశిక్, వల్లపు మురళి అనే ఐదుగురు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశామన్నాడు. వీరిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 281, 125 తో పాటు మోటార్ వాహనాల చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. నిందితుల్లో ఒకరు ప్రైవేట్ ఉద్యోగి కాగా ఇద్దరు విద్యార్థులు, ఒకరు రాపిడో డ్రైవర్, మరొకరు మెకానిక్‌గా గుర్తించామన్నారు.