08-01-2026 12:00:00 AM
మహంకాళి ఇన్స్పెక్టర్ రమేష్ గౌడ్
సికింద్రాబాద్, జనవరి 7 (విజయ్ క్రాంతి): ప్రమాదాలకు కారణమవుతున్న గాలిపటాలకు వాడే చైనా మాంజాను విక్ర యించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహంకాళి ఇన్స్పెక్టర్ రమేష్ గౌడ్ వ్యాపారులకు హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఎస్‌ఐ పూల్ సింగ్, ఏఎస్‌ఐ డానియల్, ఇతర పోలీసు సిబ్బందితో కలిసి సికింద్రాబాద్‌లో ఉన్న పతంగులు విక్రయిస్తున్న దుకాణాలలో తనిఖీలు చేపట్టారు. మహంకాళి పోలీసు స్టే షన్ పరిధిలో ఉన్న ఎనిమిది పతంగుల దుకాణాలను పరిశీలించారు.
ఈ సందర్బంగా వారికి చైనా మాం జాపై అవగాహన కలిగించారు. చైనా మాం జా, నైలాన్మాంజా గాలిపటాలు ఎగురవేసినపుడు అవి రోడ్లపై, కరెంటు స్థంభాలు, బ్రిడ్జీ లపై చిక్కుకుని వాటి వల్ల పక్షలు, మనుషు లు, వాహనదారులు ప్రమాదాల భారిన పడిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయని వివరించారు. ఈ ప్రమాదాల నేప థ్యంలో తెలంగాణ రాష్ట్రంలో చైనా మాంజా, సింథటి, నైలాన్ మాంజాను ప్రభు త్వం నిషేధించిందన్నారు. నైలాన్, సింథటిక్ మాంజా ను విక్రయించేందుకు నిలువ ఉంచిన పలు షాపులకు నోటీసులు జారీ చేశామన్నారు..