calender_icon.png 11 January, 2026 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆన్లైన్ రుణాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

10-01-2026 03:16:44 PM

అంతర్ రాష్ట్ర సైబర్ నేరస్తుని అరెస్ట్ - రిమాండ్ కు తరలింపు

వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి

వేములవాడ,(విజయక్రాంతి): తక్కువ వడ్డీ రేట్లతో లోన్లు ఇస్తామంటూ ఫేస్‌బుక్ ద్వారా ప్రజలను మోసం చేసిన అంతరాష్ట్ర సైబర్ నేరగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో దేశవ్యాప్తంగా ఎన్సీఆర్పీ పోర్టల్‌లో 30 ఫిర్యాదులు నమోదైనట్లు వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి తెలిపారు. బీహార్ రాష్ట్రానికి చెందిన లక్కీ కుమార్ అలియాస్ సదానంద్ కుమార్ (21) నకిలీ ఫేస్‌బుక్ పేజీ ద్వారా లోన్ల పేరుతో బాధితుల నుంచి ఆధార్, పాన్ వివరాలు తీసుకొని ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు గుర్తించారు.

ఫాజుల్ నగర్‌కు చెందిన ఓ బాధితుడి నుంచి రూ.1,18,400 వసూలు చేసిన ఘటనపై కేసు నమోదు చేయగా, ఇప్పటికే ముగ్గురు సహచరులను రిమాండ్‌కు తరలించారు. తాజాగా ప్రధాన నిందితుడిని హర్యానాలో అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు పంపారు. ఆన్‌లైన్ లోన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు, కాల్స్ నమ్మవద్దని వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి సూచించారు. మోసాలకు గురైన వారు 1930 సైబర్ హెల్ప్‌లైన్ ను సంప్రదించాలని ఆయన తెలిపారు.