10-01-2026 03:18:52 PM
పెంచికలపేట,(విజయక్రాంతి): మండలంలోని ఎలుక పల్లి, బొంబాయిగూడ గ్రామ పంచాయతీలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ పైన రైతులకి రామచందర్,ఉమా మహేష్ సర్పంచుల అధ్యక్షతన అవగాహన కార్యక్రమం చేపట్టారు. భూమి ఉన్న ప్రతి ఒక్కరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వ్యవసాయ అధికారి రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ వంశీ, రైతులు పాల్గొన్నారు.