calender_icon.png 11 January, 2026 | 6:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆటో డ్రైవర్లకు లైసెన్సులు అందజేత

10-01-2026 03:29:54 PM

పెంచికలపేట్,(విజయక్రాంతి): మండలంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా లైసెన్సులు లేకుండా వాహనాలు నడుపుతున్న ఆటో డ్రైవర్లను గుర్తించిన సబ్‌ ఇన్‌స్పెక్టర్ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి  అర్హులైన డ్రైవర్లకు లైసెన్సులు జారీ చేయించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టామని తెలిపారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా  లైసెన్సు కలిగి ఉండాలని, రోడ్డు భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.