08-01-2026 12:00:21 AM
ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ ఈటల రాజేందర్
మేడ్చల్, జనవరి 7 (విజయ క్రాంతి): జిల్లాలోని ప్రముఖశైవక్షేత్రం కీసర శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా తటాకం వెంకటేష్ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటేష్ శర్మకు శుభాకాంక్షలు తెలిపి శాలువా తో సన్మానించారు. ఎంపీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. \
నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. డిసిసి అధ్యక్షుడు వజ్రష్ యాదవ్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, డిసిసి మాజీ అధ్యక్షుడు హరి వర్ధన్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, బిజెపి నాయకులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, కీసర మండల పార్టీ అధ్యక్షుడు బాలరాజు, మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.