10-01-2026 03:31:46 PM
ఎంపీ నగేష్ ను కలిసిన జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్
కుమ్రం భీం అసిఫాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గెడం నగేష్ ను శనివారం ఆయన నివాసంలో జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రాన్ని అందజేశారు. కెరమెరి మండలంలోని ఉమ్రి క్రాస్ రోడ్ నుంచి పరంధోలి తండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు మంజూరు చేయించేలా చొరవ తీసుకోవాలని కోరారు. అలాగే పరంధోలి, ముకదంగూడ గ్రామపంచాయతీలకు త్రీఫేస్ విద్యుత్ లైన్ ఏర్పాటు కోసం అటవీ శాఖ అనుమతులు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శంకర్ లొద్ది, మహారాజ్ గూడ గ్రామాల్లో ఎదురవుతున్న మొబైల్ సిగ్నల్ సమస్యను పరిష్కరించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ టవర్లు ఏర్పాటు చేసేలా చొరవ తీసుకోవాలని కోరారు.