calender_icon.png 11 January, 2026 | 6:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుర్రాలగొంది ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడిగా కోల రాజు

10-01-2026 03:20:48 PM

సిద్దిపేట రూరల్: గుర్రాలగొంది గ్రామ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడిగా కోల రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం గ్రామంలో జరిగిన ఎంప్లాయిస్ అసోసియేషన్ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా గోపాలపురం శంకర్, ప్రధాన కార్యదర్శిగా మట్టే వెంకటరెడ్డి, ఆర్థిక కార్యదర్శిగా ఉండ్రాళ్ల తిరుపతి ఎన్నికయ్యారు. గ్రామ, పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని నూతన కార్యవర్గం పేర్కొంది. ఉద్యోగ సంఘ భవనానికి స్థలం అందజేసిన కోల రాజును ఉద్యోగులు, గ్రామ సర్పంచ్ ఆకుల స్వప్న హరీష్ సన్మానించారు.

గ్రంథాలయానికి పుస్తకాల అందజేత

గుర్రాలగొంది గ్రామ గ్రంథాలయానికి పుస్తకాలు అందించడం అభినందనీయమని గ్రామ సర్పంచ్ ఆకుల స్వప్న హరీష్ అన్నారు. శనివారం గ్రామానికి చెందిన హాస్టల్ వార్డెన్ శ్యామల సత్యనారాయణ ఇంజనీరింగ్‌కు సంబంధించిన నలభై పుస్తకాలను గ్రంథాలయానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను సన్మానించారు.