- ఖాతాదారులకు ఎల్‌సీసీ హెచ్చరిక
న్యూఢిల్లీ, జూన్ 25: ప్రస్తుత ఎల్‌ఐసీ పాలసీదారుల నుంచి బీమా పాలసీలను కొనుగోలు చేయడానికి కొన్ని వ్యాపార సంస్థలు సంప్రదిస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) తన ఖాతాదారులను హెచ్చరించింది. పాలసీదారులు వారి పాలసీపట్ల తీసుకునే నిర్ణయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని, లేకపోతే వారి కుటుంబం రిస్క్ కవరేజ్‌కు, ఆర్థిక స్థిరత్వానికి ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నది. మంగళవారం ఎల్‌ఐసీ విడుదల చేసిన ప్రకటన వివరాలు..
- పాలసీల కొనుగోలుకు సంప్రదిస్తున్న ఎటువంటి సంస్థతోనూ, ఆయా సంస్థలు ఆఫర్ చేసే సర్వీసులతోనూ ఎల్‌ఐసీకి సంబంధం ఏదీ లేదు. ఎల్‌ఐసీ మాజీ ఉద్యోగులు, సిబ్బంది చేసే ఎటువంటి ప్రకటనల పట్ల ఎల్‌ఐసీ బాధ్యత వహించదు.
- ఎల్‌ఐసీ పాలసీల అమ్మకం/బదిలీ లేదా అసైన్‌మెంట్ సెక్షన్ 38తో సహా బీమా చట్టం 1938 ప్రకారం జరగాలి. అటువంటి పాలసీ విక్రయం/బదిలీ లేదా అసైన్‌మెంట్ బోనాఫైడ్ కాదంటూ ఎల్‌ఐసీ తిరస్కరిస్తుంది.
చేయాల్సినవి/చేయకూడనివి
- పాలసీ సరైన సమాచారాన్ని ఎల్‌ఐసీ వెబ్‌సైట్ www.licindia.in లో ధృవీకరించుకోవాలి లేదా సమీపంలోని ఎల్‌ఐసీ శాఖను సంప్రదించాలి.
- అనుమానాస్పద కాల్ వచ్చిన ఫోన్ నంబరును వివరాలతో సహా మీ పరిధిలోని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదును నమోదు చేయాలి.
- అటువంటి అనుమానాస్పద కాల్స్‌ను, వివరాలను ఈమెయిల్‌లో spuriouscalls@licindia.com కు తెలియపర్చాలి
- మీరు ధృవీకరించుకోలేని కాల్స్‌ను స్వీకరించకండి.
- మీ పాలసీని సరెండర్ చేయమని, అదనపు ప్రయోజనాలు కల్పిస్తామంటూ కాలర్లు చేసే కాల్స్‌ను పట్టించుకోకండి.
- జీవితబీమా పాలసీల ద్వారా ఒనగూడే ప్రయోజనాలను ఎక్కువచేసే వాగ్దానాల పట్ల ఆకర్షితులు కాకండి.
- అదనపు బోనస్‌లు ఇస్తామని, అధిక ప్రయోజనాలు కల్పిస్తామన్నవారి మాటలు నమ్మకండి.
- మీ పాలసీ వివరాలను/ఇతర సమాచారాన్ని కాలర్‌తో షేర్ చేసుకోకండి.