26-06-2024 12:05:00 AM
హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): భారత్, ఉజ్బెకిస్థాన్ దేశాల మధ్య ఫార్మా రంగంలో వాణిజ్యం, పెట్టుబడి అవకాశాలను పెంపొందించేందుకు ఇండో- స్థాన్ ఫార్మా బిజినెస్ ఫోరం సదస్సు మంగళవారం నాడు హైదరాబాద్‌లో జరిగింది. దీనికి రెండు దేశాల నుంచి ఉన్నత స్థాయి అధికారులు, పరిశ్రమ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ ఫోరమ్‌లో భారత్‌లోని ఉజ్బెకిస్థాన్ రిపబ్లిక్ రాయబారి సర్డోర్ ఎం. రుస్తంబెువ్‌తో పాటు నియో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ అండ్ టెక్నాలజీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దివ్య రాజ్, ఉజ్బెకిస్థాన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ అబ్దుల్లా అజిజోవ్, హెటిరో ల్యాబ్స్, భారత్ బయోటెక్ తదితర ఫార్మా కంపెనీ పాల్గొన్నాయి.
ఇరు దేశాల మధ్య ఒప్పందాలు...
సదస్సులో పలు ఎంఓయూలపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందాలు భారత్, ఉజ్బెక్ ఫార్మా పరిశ్రమల మధ్య జాయింట్ వెంచర్లు, పరిశోధన సహకారాలు, సాంకేతికత బదిలీలకు మార్గం సుగమం చేస్తాయని ఇరు దేశాల ప్రతినిధులు పేర్కొన్నారు. సంబంధిత పెట్టుబడులపై కూడా పలు ఒప్పందాలు =జరిగాయి. ప్రస్తుతం భారత్, ఉజ్బెకిస్థాన్ మధ్య సుమారు 800 మిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోందని... భారత్ నుంచి ప్రధానంగా ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు ఉజ్బెక్‌కు ఎగుమతి అవుతున్నాయని ఉజ్బెకిస్థాన్ రిపబ్లిక్ రాయబారి సర్డోర్ ఎం. రుస్తంబెువ్ అన్నారు. ఆయన తెలిపారు.