calender_icon.png 20 January, 2026 | 5:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం

20-01-2026 12:00:00 AM

జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్

జూబ్లీహిల్స్, జనవరి 19 (విజయక్రాంతి): డివిజనులోని కార్మికుల సంక్షేమానికి ప్రాధా న్యం ఇస్తున్నామని జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్ అన్నారు. డివిజనులోని ఇందిరానగర్‌కు చెందిన భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ కార్డులను సొంత ఖర్చులతో ఇప్పించారు. అందుకు సంబంధించిన పత్రాలను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కార్మికుల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా కార్డులు ఇప్పించామన్నారు.అర్హులైన ప్రతిఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చూస్తామన్నారు. ప్రజలకు ఎటువంటి సమస్య ఎదురైనా దాన్ని పరిష్కరి స్తానని హామీనిచ్చారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావిస్తానని పేర్కొన్నారు. అవసరమైన వారికి అండగా నిలిచి వెన్నంటి ఉంటానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.