25-06-2025 01:46:28 AM
మేడ్చల్ టౌన్ ప్లానింగ్ విభాగంపై విమర్శలు
మేడ్చల్ అర్బన్, జూన్ 24: బడా బాబులకు వర్తించని నిబంధనలు కేవలం పేద చిరు వ్యాపారులకే వర్తిస్తాయని పలువురు మేడ్చల్ పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మంగళవారం మేడ్చల్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు ప్రధాన రహదారిలో ఉన్నటువంటి ఫుట్ పాత్ ఆక్రమణలను, చిన్నపాటి వ్యాపారం చేసుకునే చాయి డబ్బాలను ఎలాంటి సమాచారం, నోటీసులు ఇవ్వకుండా హడావిడిన కూల్చివేసారని ఆరోపిస్తున్నారు.
మేడ్చల్ పట్టణంలో ఒకరోక్కపు అనుమతులు తీసుకొని మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతూ మరోరకంగా నిర్మాణాలు చేపడుతున్న వారికి నిబంధనలు వర్తించవా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. బడా బడా అక్రమ నిర్మాణాలు చేపడుతూ నిబంధనలను పాటించని వారిపై ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని మేడ్చల్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులకు బడా బిల్డర్ల వద్దనుండి ముడుపులు ముట్టడంతో వాటి జోలికి వెళ్లడం లేదని పలువురు స్థానికులు విమర్శిస్తున్నారు. ఇదే విషయమై మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారిని ఫోన్ లైన్ ద్వారా వివరణ కూడా ఎందుకు సంప్రదించగా వారు స్పందించలేదు.