01-06-2025 12:00:00 AM
టీనేజీలో ముఖంపైన అక్కడక్కడా మొటిమలు రావ డం, తగ్గడం సహజమే. కొందరిలో మాత్రం ఇవి యాక్నేగా మారి ముఖం, మెడ, ఛాతీపైన కూడా వ్యాపిస్తాయి. అవి మిగిల్చిన మచ్చలు ముఖాన్ని పాడుచేస్తాయి. ఇక యాక్నేని తగ్గించడానికి వాడే మందులు పెద్దగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. దీనికి పరిష్కారం వెతికే నేపథ్యంలోనే అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు యాక్నేకి కారణమయ్యే బ్యాక్టీరియాపైన లోతుగా పరిశోధనలు చేశారు.
పిల్లలు టీనేజీలో ఉన్నప్పుడు హార్మోన్ల కారణంగా ముఖంలో నూనెలు ఎక్కువగా విడుదల అవుతాయి. ఆ సమయంలోనే సి రకానికి చెందిన బ్యాక్టీరియాలు ఈ నూనెలని ఆహారంగా తీసుకుని, చర్మంపైన స్థిర నివాసం ఉండి మొటిమలు వచ్చేలా చేస్తాయి. అయితే ఈ మొండి బ్యాక్టీరియా ఇలా వచ్చి అలా వెళ్లిపోవదట.. ఒక్కసారి అడుగుపెడితే చర్మంపైన ఉండే రంధ్రాలని 80శాతం ఆక్రమించుకుని వందలూ, వేలుగా వృద్ధి చెందుతూ..
బలాన్ని పెంచుకుని సమయం వచ్చినప్పుడు యాక్నే తీవ్రతని పెంచుతూ ఉంటుంది. పరిస్థితి అంతవరకూ వెళ్లకుండా సిరూ రకం బ్యాక్టీరియా పూర్తిగా వృద్ధి చెందని దశలో అంటే పిల్లలు టీనేజీ వయసులో ఉండగానే చర్మానికి మేలు చేసే ప్రొ వాడితే భవిష్యత్తులో వచ్చే యాక్నే సమస్యకు చెక్ చెప్పవచ్చంటున్నారు నిపుణులు.