calender_icon.png 11 October, 2025 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లలకు పచ్చిపులుసు పెడతారా?

11-10-2025 01:52:55 AM

  1. మిడ్డే మీల్స్ ఇంత అధ్వానంగా ఉంటే రోగాలు రావా?

కొత్త కామన్ డైట్ మెనూ ఎందుకు అమలు చేస్తలేరు

పందిల్లలో స్కూల్  హెడ్మాస్టర్‌పై కలెక్టర్ ఫైర్

చర్యలు తీసుకోవాలని డీఈవోకు ఆదేశాలు

హుస్నాబాద్, సెప్టెంబర్ 10 :పిల్లలకు పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ మిడ్డే మీల్ పథకం అసలు ఉద్దేశం. దానిని ఎవ్వ రూ తేలికగా తీసుకోవద్దు. కొత్త కామన్ డైట్ మెనూను కచ్చితంగా అమలు చేయాలి. అంగన్వాడీ, బస్తీ దవాఖానల్లోనూ సేవా ప్ర మాణాలు మెరుగుపరచాలి అని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి అన్నారు. శుక్రవా రం ఆమె జిల్లాలోని హుస్నాబాద్ మండలం పందిల్లలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. అనంతరం అదే గ్రా మంలోని అంగన్వాడీ కేంద్రంతోపాటు హు స్నాబాద్ లోని బస్తీ దవాఖానను తనిఖీ చే శారు.

ముందుగా ఆమె పందిల్లలోని ప్రైమరీ స్కూల్ లో మధ్యాహ్న భోజనాన్ని చూసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతీ విద్యార్థి ఆరోగ్యం కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. కొన్ని పాఠశాలల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. పచ్చిపులుసు, తక్కువ పోషకాల వంటకాలతో పిల్లల ను ఎలా ఆరోగ్యవంతంగా ఉంచగలము? అని ప్రశ్నించారు. కొత్తగా రూపొందించిన కామన్ డైట్ మెనూ రాష్ట్రవ్యాప్తంగా సమానంగా అమలవ్వాలనే ఉద్దేశంతో తీసుకువ చ్చినదని, దానిని లెక్కచేయకుండా తమ ఇష్టానుసారం వండడం సరికాదన్నారు.

మెనూకు విరుద్ధంగా కేవలం టమాటా పప్పు, పచ్చి పులుసు, గుడ్డు మాత్రమే వండటంపై మండిపడ్డారు. ‘పిల్లలకు పచ్చిపులు సు పెడుతూ అనారోగ్యానికి గురి చేస్తారా?‘ అంటూ వంట సిబ్బందితోపాటు హెడ్మాస్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త కామన్ డైట్ మెనూను అమలు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడంపై కలెక్టర్ ఫైర్ అయ్యారు.

‘తక్కువ మంది పిల్లలు వచ్చారు, కూరగాయలు దొరకట్లేదు‘ అనే సాకులు చెబితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పి ల్లలకు పౌష్టికాహారం అందించడమే మధ్యా హ్న భోజన పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించని హెడ్మాస్టర్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అక్కడికక్కడే డీఈవోకు ఫోన్ ద్వారా ఆదేశించారు.

అంగన్వాడీ, బస్తీ దవాఖానల్లో సేవలు మెరుగుపడాలి

పందిల్లలోనిఅంగన్వాడీ సెంటర్ను సందర్శించిన కలెక్టర్, పిల్లలకు అందించే సేవలను పరిశీలించారు. చిన్నారులకు సాంబారు, గు డ్డు పెట్టినట్టు ఆయా కలెక్టర్కు తెలిపారు. పిల్లలకు అందించే స్నాక్స్ను కలెక్టర్ టేస్ట్ చేశారు. రోజు సరిపడినన్ని స్నాక్స్ పెట్టాలని ఆయా ను ఆదేశించారు. బాలింతలకు అందించే బా లామృతం ఇతర సరుకులను కూడా ఆమె చెక్ చేశారు.

విధులు సక్రమంగా నిర్వహించాలని, అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవ ని సిబ్బందిని హెచ్చరించారు. అనంతరం, హుస్నాబాద్ లోని బస్తీ దవాఖానను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెడికల్ ఆఫీసర్ డిప్యూటిషన్ రద్దు వల్ల వెళ్లారని, డాక్టర్ లేక వచ్చే రోగులు ఇబ్బంది పడుతున్నారని సి బ్బంది కలెక్టర్కు తెలిపారు. డాక్టరు వచ్చేలా చూస్తానని, రోగులకు మాత్రం సిబ్బంది ఓపికగా వైద్యం అందించాలని ఆదేశించారు.