calender_icon.png 11 October, 2025 | 5:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు సేఫ్టీ డ్రైవ్ మరింత వేగిరం

11-10-2025 01:53:33 AM

  1. జీహెచ్‌ఎంసీలో రాత్రిపూట కూడా పనులు
  2. ఇప్పటి వరకు 14,112 పైగా గుంతల పూడ్చివేత

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 10 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ వ్యా ప్తంగా రోడ్డు సేఫ్టీ డ్రైవ్ ముమ్మరంగా సాగుతుంది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో జీహెచ్‌ఎంసీ రోడ్డు సేఫ్టీ డ్రైవ్ మరింత వేగిరం చేసింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ వంద శాతం గుంతలు పూడ్చడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రోడ్డు భద్రత చర్యలలో భాగంగా గుంతల పూడ్చివేత పనులు, క్యాచ్ పిట్ రిపేర్లు, రోడ్ల మరమ్మత్తు పనులు, ప్యాచ్ వర్క్ పనులు, కవర్ రీప్లేస్మెంట్లు, సెంట్రల్ మీడియన్ మరమ్మతులు నిరంతరంగా కొనసాగుతున్నా యి.

మెయింటెన్స్ చీఫ్ ఇంజనీర్ సహదేవ్ రత్నాకర్ క్షేత్ర స్థా యిలో పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం నాటికి మొత్తం 16,541గుంతలు గుర్తించగా, 14,112 గుంతలకు మరమ్మతు లు చేశారు. ఇప్పటి వరకు 771 క్యాచ్ పిట్స్ రిపేర్లు, 367 కవర్ రీప్లేస్మెంట్లు, 18 సెంట్రల్ మీడియన్ మరమ్మతులు పూర్తి అయ్యాయి. యుద్ధప్రాతిప దికన రోడ్డు సేఫ్టీ డ్రైవ్ చేపడుతున్నామని కమిషనర్ ఆర్‌వి కర్ణన్ అన్నారు.