calender_icon.png 27 July, 2025 | 9:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నితీశ్‌కు మద్దతివ్వడంపై చింతిస్తున్నా..

27-07-2025 12:04:08 AM

  1. కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్
  2. అంబులెన్స్ అత్యాచారాన్ని ఖండిస్తూ.. నితీశ్ సర్కారుపై విమర్శలు
  3. ఇకనైనా సర్కారు మేలుకోవాలంటూ చురకలు

పాట్నా, జూలై 26: బీహార్‌లో నితీశ్ స ర్కారుకు మద్దతిచ్చినందుకు చింతిస్తున్నట్టు కేంద్రమంత్రి, ఎల్‌జేపీ (రాంవిలాస్) పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. బీహార్‌లో జరుగుతున్న అఘాయిత్యాలపై ఆయ న సర్కారుపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టా రు. త్వరలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న తరుణంలో పాశ్వాన్ వ్యాఖ్యలు హా ట్‌టాపిక్‌గా మారాయి. ‘బీహార్‌లో హత్యలు, దోపిడీలు, కిడ్నాప్‌లు నిత్యకృత్యమయ్యాయి.

ప్రభుత్వం నేరస్తుల ముందు తేలిపోతోంది. ఈ నేరాలు జరగకుండా నియంత్రించడం లో నితీశ్ సర్కారు ఘోరంగా విఫలమైంది. బీహార్‌లో ప్రజలు సురక్షితంగా ఉండలేకపోతున్నారు. రాష్ట్రంలో నేరాల రేటును ప్రభు త్వం తగ్గించలేకపోతుంది. ప్రజలను రక్షించలేని ప్రభుత్వానికి మద్దతిస్తున్నందుకు అసం తృప్తిగా ఉంది.

ఇకనైనా సర్కారు నేరాల కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలి’ అని పాశ్వా న్ నితీశ్ సర్కారుకు చురకలంటించారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న కేంద్రమంత్రి పాశ్వాన్ పార్టీ బీహార్‌లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనుందని ఇప్పటికే సూచనప్రాయంగా వెల్లడించారు. బీహార్‌లో ఇటీవల అంబులెన్సులో ఓ యువతిపై అత్యాచారం జరగడంతో విపక్షాలు, స్వపక్షాలు నితీశ్ సర్కారుపై భగ్గుమంటున్నాయి.