calender_icon.png 8 November, 2025 | 12:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిగ్రీ కళాశాల రసాయన శాస్త్ర ఆధ్యాపకుడికి డాక్టరేట్

07-11-2025 10:19:19 PM

మహబూబ్ నగర్ టౌన్: ఎన్టీఆర్ ప్రభుత్వ  మహిళా డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న నామని మార్కండేయకి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి "సింథసిస్ ఆఫ్ నావెల్ హెటిరో సైక్లిక్  లైగాండ్స్  అండ్ థెయర్ ట్రాన్సిషన్ మెటల్ కాంప్లెక్స్-  క్యారక్టరైజేషన్ అండ్ స్టడీ ఆఫ్ బయోలాజికల్ యాక్టివిటీ"అనే అంశంపై అసోసియేట్ ప్రొఫెసర్ ఎన్ నవనీత పర్యవేక్షణలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో కళాశాలలోని టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది ఘనంగా సన్మానించారు.

కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ... ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి అని వారు పరిశోధనల వైపు ముందుకు సాగుతూ విద్యార్థులను ఆ దిశగా ప్రోత్సహించాలని తెలిపారు. కళాశాలలో ఎక్కువ సంఖ్యలో డాక్టరేట్ సాధించిన అధ్యాపకులు ఉండటం కళాశాలకు గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ అమీనా ముంతాజ్, పద్మా అనురాధ, ఐ క్యు ఏ సి కోఆర్డినేటర్ జె. శ్రీదేవి , పీజీ. కోఆర్డినేటర్ ఎం.ప్రవీణ్ కుమార్ మరియు రసాయన శాస్త్ర విభాగం అధ్యాపకులు బి. అనిత, ప్రకాష్, హరిబాబు, కళమ్మ, రాజేశ్వరి,మనెక్క పాల్గొన్నారు.