07-11-2025 10:23:00 PM
1104 యూనియన్ ఉన్నదే సమస్యల పరిష్కారం కోసం
1104 యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి. సాయిబాబు
హన్వాడ: ప్రతి ఒక్కరి జీవితంతో పాటు ఏ వ్యవస్థలోనైనా సమస్యలు ఉంటాయని వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు సాగడమే 1104 యూనియన్ లక్ష్యమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి సాయిబాబు అన్నారు. శుక్రవారం 114 యూనియన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో జెండా పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఐక్యంగా ఉంటూ ముందుకు సాగుదామని ఎవరికీ ఏ ఆపద వచ్చిన మేమున్నాము అనే భరోసా 1104 యూనియన్ ఇస్తుందని తెలిపారు. అందరం కలిసి మెలిసి ఉంటేనే ప్రతి సమస్యకు పరిష్కారం మార్గం కనిపిస్తుందని స్పష్టం చేశారు. ఐక్యత కోసమే జెండా పండుగను ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమము లో నాయకులు స్వామి,పాండు, విజయకుమార్,సోమేశ్, యాదయ్యగౌడ్, శేఖర్ రామరాజు, బాలరాజ్, డివిజన్ కార్మికులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.