28 August, 2026 | 2:06 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

కొండమల్లేపల్లిలో డాక్టర్స్ అకాడమీని మూసివేయాలి

11-04-2026 03:54 PM

దేవరకొండ,(విజయక్రాంతి): కొండమల్లేపల్లిలో ఎలాంటి ప్రభుత్వం అనుమతి లేకుండా డాక్టర్స్ అకాడమీ పేరుతో ఉన్నటువంటి కళాశాలను వెంటనే మూసివేయాలని నగర కార్యదర్శి దినేష్ డిమాండ్ చేశారు. అనుమతి లేని కళాశాల ముందు ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లెపల్లి నగర కార్యదర్శి దినేష్ మాట్లాడుతూ... ప్రభుత్వ అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నటువంటి డాక్టర్స్ అకాడమీని వెంటనే మూసివేసి కళాశాల సంబంధించినటువంటి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అదేవిధంగా విద్యార్థులకు మోసపూరితమైనటువంటి చర్యలకు పాల్పడినందుకు విద్యార్థులు కట్టినటువంటి ఫీజులు వెంటనే తిరిగి చెల్లించాలని, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అనుమతి ఉన్నటువంటి కళాశాలలో మాత్రమే మీ పిల్లల్ని చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు అలీ శ్రీను సాయి శివాజీ తదితరులు పాల్గొన్నారు.