02-07-2025 01:09:51 AM
చేర్యాల, జులై 1: తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి రోగులకు పునర్జన్మ ప్రసాదించే ప్రత్యక్ష దైవం డాక్టర్లు మాత్రమేనని చేర్యాల సిఐ ఎం శ్రీను అన్నారు. చేర్యాల పట్టణంలో డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సందర్భంగా యశోద ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఆపద సమయంలో రోగులకు సేవలు అందిస్తూ వారి మన్ననలు పొందేది డాక్టర్ మాత్రమేనన్నారు. ప్రజలు అనారోగ్యానికి గురి కాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ, ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్ లు చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. స్థానిక వైద్యులు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. యువత, విద్యార్థులు చెడు వ్యసనాలకు అలవాటు పడి తమ విలువైన జీవితాన్ని ఆగం చేసుకోవద్దని పిలుపునిచ్చారు.
మంచి ఆరోగ్య అలవాట్లను అలవర్చుకోవాలని పేర్కొన్నారు. అంతకుముందు విద్యార్థులు, నాయకులు, వైద్యుల తో కలిసిస్థానిక గాంధీ సెంటర్ నుండి హనుమాన్ టెంపుల్ వరకు వారి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రామగళ్ల పరమేశ్వర్ ఎంఈఓ రచ్చ కిష్ణయ్య ఎస్త్స్రలు నీరేష్, సమత వివిధ పార్టీలకు చెందిన నాయకులు దాసరి శ్రీకాంత్, అందె బీరయ్య, పుర్మా ఆగం రెడ్డి, మేడిశెట్టి శ్రీధర్, అందే అశోక్ తదితరులు పాల్గొన్నారు.