16 April, 2026 | 6:09 AM

పేద కుటుంబానికి వైద్యుల చేయూత

05-11-2025 04:55 PM

నిర్మల్ రూరల్: నిర్మల్ పట్టణంలోని తిరుమల నర్సింగ్ హోమ్ లో పేద కుటుంబానికి వైద్యులు చేయూత అందించారు. అదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండల కేంద్ర స్వప్న గర్భిణిగా ఉంటూ ఏడు నెలలకి పాప జన్మించడంతో ఆ పాపకు బరువు పెరగడానికి మెరుగైన వైద్యం పిల్లల వైద్యులు డాక్టర్ మురళీధర్ ఆధ్వర్యంలో అరుదైన చికిత్సను అందించి కోల్కున్న తర్వాత బుధవారం డిశ్చార్జ్ చేసినట్టు తెలిపారు. పేద కుటుంబం కావడంతో వారికి మెరుగైన వైద్యం అందించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు రమేష్ రెడ్డి సిబ్బంది గణపతి రెడ్డి తదితరులు ఉన్నారు.