calender_icon.png 5 November, 2025 | 7:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్ద కాపర్తి చెరువులో చేప పిల్లల విడుదల

05-11-2025 04:58:41 PM

సింగిల్ విండో చైర్మన్ ఏనుగు రఘుమారెడ్డి..

చిట్యాల (విజయక్రాంతి): ప్రభుత్వం ద్వారా మంజూరైన ఉచిత చేప పిల్లలను సింగిల్ విండో చైర్మన్ ఏనుగు రఘుమారెడ్డి బుధవారం పెద్ద కాపర్తి చెరువులోకి విడుదల చేశారు. నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం ఆదేశానుసారం చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన 72 వేల ఉచిత చేప పిల్లల (బొచ్చ,రవ్వ,పెరిక)ను జిల్లా మత్స్య సహకార శాఖ ఏడి రాజరాం, సూపరింటెండెంట్ వీరమల్ల శ్రీనివాస్ లతో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక సింగిల్ విండో చైర్మన్ ఏనుగు రఘుమారెడ్డి  చేప పిల్లలను చెరువు లోకి విడుదల చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా పాలనలో భాగంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మత్స్య కార్మికుల సంక్షేమం కోసం, ఆర్థిక అభివృద్ధి పురోగతికై ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడం మంచి కార్యక్రమమని, స్తానిక శాసనసభ్యుడు వేముల వీరేశం పిల్లాయిపల్లి కాలువ ద్వారా చెరువులను నింపుటక అహర్నిశలు కృషి చేశారని, వారికి రైతులు, మత్స్యకారుల పక్షాన ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దకాపర్తి మత్స్య కార్మిక సంఘం సొసైటీ అధ్యక్షుడు బుంగపట్ల తిమ్మయ్య, కోశాదికారి నూతి తిరుమలేష్, మాజీ అధ్యక్షుడు బైరగోని బిక్షం, నూతి  వెంకటేష్, మోర సత్యం, మోర సత్తయ్య, నూతి  సతీష్, నూతి కిష్టయ్య, నూతి యాదయ్య దేశగోని గోపాల స్వామి, నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు.