29-07-2025 12:30:04 AM
బ్రాహ్మణపల్లిలో విషాదం
కామారెడ్డి, జూలై 28 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో బస్సు ఢీకొనడంతో కార్పెంటర్ మృతి చెందిన ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఈ ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన పైడా కుల నారాయణ( 52) టీవీఎస్ ఎక్సెల్ పై కామారెడ్డికి వచ్చి కార్పెంటర్ పనిచేసే వెళ్లేవాడు.
సోమవారం ఉదయం కార్పెంటర్ పని కోసం కామారెడ్డికి వస్తుండగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్లో కరీంనగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొనడాంతో పైడాకుల నారా యణ అక్కడికక్కడే మృతి చెందాడు. తలకు హెల్మెట్ ధరించి ఉంటే బ్రతికే వాడని స్థానికులు తెలిపారు. మరో రెండు నిమిషాల్లో పని పైకి ఎక్కాల్సిన నారాయణ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ప్రాణాలు వదిలాడు.
ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కామా రెడ్డికి వచ్చి బోరున వి లపించారు. బస్సు రూపంలో మృత్యు కాటేసిందని తెలిపారు. కార్పెంటర్ గా కామారెడ్డిలో రెడ్ మేడ్ డోర్ల తయారీ పనులు చేస్తూ ఉండేవాడు. ప్రతిరోజు కామారెడ్డికి వచ్చి కార్పెంటర్ పనిచేసి పైడాకుల నారా యణ స్వగ్రామమైన బ్రాహ్మణపల్లికి వెళ్లేవాడు. సోమవారం ఉదయం ఇంటి నుంచి పని కోసం కామారెడ్డికి వస్తుం డగా సిరిసిల్ల రోడ్ లో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో నారాయణ అక్కడికక్కడే మృతి చెందారు.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘ టన స్థలానికి చేరుకొని నారాయణ మృ త దేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిం చారు. పోస్ట్మార్టం చేసిన అనంతరం బ్రాహ్మణపల్లి గ్రామానికి నారాయణ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు బం ధువులు తీసుకెళ్లారు. మృతుడు నారా యణకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.