కాంగ్రెస్‌కు హిందువుల ఓట్లు వద్దా?
- ర్చెగొట్టేలా సీఎం మతాధారిత ఓటు బ్యాంకు వ్యాఖ్యలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు విమర్శ
హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): ముస్లింలకు గౌరవం ఉందా అంటే అది కాంగ్రెస్ వల్లేనని, ఆ పార్టీ లేకుంటే ము స్లింలకు దిక్కులేదని సీఎం చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ముస్లింలను కేవలం ఓటు బ్యాంక్ గా మాత్రమే చూస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రికి, మీ పార్టీకి ముస్లింల ఓట్లు మాత్ర మే కావాలనుకుంటే, హిందువుల ఓట్లు అవసరం లేదని బహిరం గంగా చెప్పాలని సవా ల్ విసిరారని బుధవారం ప్రకటనను విడుదల చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు సంతుష్టీకరణ రాజకీయాలకు నిండైన ఉదాహరణ అని పేర్కొన్నారు. అభివృద్ధి, పాలన, ప్రజాసేవపై చర్చ చేయడానికి బదులుగా, సమాజాన్ని మతం పేరుతో విభజించి రాజకీయ లాభం పొందే ప్ర యత్నమే ఇదని తెలిపారు. కేవలం 20 శా తం ముస్లింల ఓట్ల కోసం, 80 శాతం హిందువుల భావాలను నిర్లక్ష్యం చేయడం, దీనిని సెక్యులరిజం అని చెప్పడమనేది ప్రజలను మోసం చేయడమేనని పేర్కొన్నారు.
మంత్రి పదవులు సైతం ఎన్నికల లాభం కోసం మత ప్రాతిపదికన పంచడం సిగ్గుచేటని విమర్శించారు. ముస్లిం సమాజానికి నిజమైన న్యాయం చేయాలంటే విద్య, ఉపాధి, ఆర్థిక అవకాశాల దిశగా చర్య లు తీసుకోవాలని సూచించారు. ‘రేవంత్ రెడ్డి .. కేసీఆర్ కేటీఆర్‌పైన పెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసు, ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు ఏమైంది?’ అని ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబాన్ని, బీఆర్‌ఎస్ నేతలను రక్షించడమే రేవంత్‌రెడ్డి బాధ్యత అన్నారు.






