calender_icon.png 6 November, 2025 | 9:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి

06-11-2025 12:00:00 AM

 నాగర్ కర్నూల్, నవంబర్ 5 ( విజయక్రాంతి ): కొన్ని రోజులుగా అధిక వర్షాల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పలు చోట్ల జలమయం అవుతున్న వరద ముంపు ప్రాంతాలను ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని  బిఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం సమీపంలో ప్రధాన రహదారి మీదుగా తరచుగా నీటి ప్రవాహం పెరుగుతోంది.

గువ ప్రాంతంలో ఉన్న అయ్యప్ప టెంపుల్ , మిషన్ కాంపౌండ్, నల్లవెల్లి రోడ్డు ప్రాంతాల నుంచి వాన నీరు వరదగా ఈశ్వర్ కాలనీ మీదుగా ప్రధాన రోడ్డు పైకి చేరుతున్నట్టు గుర్తించారు. వరద ఉదృతిని కట్టడి చేస్తూ, ముంపు నివారణకు తీసుకోవాల్సిన చర్యలను మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డికి సూచించారు. ఆయన వెంట మాజీ కౌన్సిలర్ సునేంద్ర, కాంగ్రెస్ నేతలు నరసింహారెడ్డి, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.