calender_icon.png 11 July, 2025 | 8:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రా దూకుడు పెంచేనా?

11-07-2025 12:43:45 AM

- శివారుకు వస్తుందా? నగరానికే పరిమితమా?

- తుర్కయంజాల్లో కబ్జాల బారిన చెరువులు

- దిలావర్ ఖాన్ చెరువును ఆక్రమిస్తూ వెంచర్

- గంగరాయిచెరువును మట్టితో నింపిన రియల్టర్లు

- ఇంజాపూర్‌లో గూడెంకుంట చెరువు మాయం

- గువ్వకుంట, దుబ్బకుంట కనుమరుగు

- హైడ్రా దృష్టిసారించాలని స్థానికుల విజ్ఞప్తులు

తుర్కయంజాల్, జులై 10:చెరువులు, కుంటలతో కళకళలాడిన రాష్ట్ర రాజధాని ఇ ప్పుడు బహుళ అంతస్థుల మేడలతో దర్శనమిస్తోంది. చిరుజల్లు కురిసినా చెరువులను తలపించే రోడ్లు ఇప్పుడు సర్వసాధారణం. ఇది నగరం నడిబొడ్డున అయితే పర్లేదు... కా నీ, శివారు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ధనార్జనే ధ్యేయంగా కొందరు రి యల్టర్లు అధికారులు, పాలకులను మభ్యపె ట్టి, డబ్బుతో ఏమార్చి చెరువులను సైతం ప్లా ట్లుగా మలిచారు.

చెరువులకు మళ్లీ పూర్వస్థి తి రావాలంటే హైడ్రా ముందున్న సవాల్లేంటి? ఎలా ముందుకు వెళ్లబోతున్నారు? ఈ కథనంలో చూద్దాం. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో 500 పైచిలుకు ఎకరాల్లో మాసాబ్చెరువు వి స్తరించి ఉంది. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు తర్వాత అంతటి విస్తీర్ణంలో ఉన్న చెరువు మాసాబ్చెరువే. దీని పరిరక్షణే ధ్యేయంగా హైడ్రా పావులు కదుపుతోంది. దీన్ని ప్రజ లూ హర్షిస్తున్నారు. ఈ చెరువుకు ఎగువన, దిగువన సుమారు 7.50కి.మీ. మేర ఉన్న నాలాను విస్తరించి, మోడల్ నాలాగా తీర్చిదిద్దుతామని హైడ్రా కమిషనర్ ఇప్పటికే ప్రకటించి ఉన్నారు.

అయితే ఈ నాలాను ఆ క్రమించి ఇప్పటికే చాలా నిర్మాణాలు వెలిశా యి. ముఖ్యంగా చెరువు కింద భాగాన నాలా పూర్తిగా కబ్జాకు గురైంది. ఇంజాపూర్ పరిధిలో ఏర్పాటు చేసిన కొన్ని వెంచర్లు పూర్తిగా నాలాపైనే ఉన్నాయి. ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలు ఇప్పటికే భవనాలు నిర్మించుకొని నివసిస్తున్నారు. బహుశా 2022 వరదలు వచ్చేవరకు ఇక్కడ నుంచి నాలా ఉన్న విషయం ఆ భవనాల యజమానులకు తెలిసి ఉండదు. గత బీఆర్‌ఎస్ హ యాంలో ఇదే నాలాపై పేదల కోసం డబుల్బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు.

ఈ భవనాల సెల్లార్లన్నీ ఇప్పుడు నీటిలో ఉండటం గమనార్హం. అయితే, మాసాబ్చెరువు దిగు వ భాగాన కుచిం చుకు పోయిన ఈ నాలా ను విస్తరించడం ఇప్పుడు హైడ్రా ముందు న్న సవాల్. ఇప్పటికే దాదాపు ఒక కిలోమీటర్ మేర భవనాలన్నీ పూర్తయ్యాయి. వాటిని ఎలా తొలగిస్తారు? ప్రభు త్వమే నిర్మించిన కట్టడాలను కూల్చుతారా? హైడ్రా కమిషనర్ చెప్పినట్టు జరుగుతుందా? అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

దిలావర్ ఖాన్ చెరువు ఆక్రమణ

ఇంజాపూర్ దిలావర్ ఖాన్ చెరువు కూడా ఆక్రమణలకు గురైంది. చెరువు శిఖా న్ని ఆక్రమించి నిర్మాణాలు వెలిశాయి. అధికార పార్టీ ఓ నేత చెరువు శిఖాన్ని కబ్జా చేసి పెద్ద ఎత్తున వెంచర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చెరువు నాలాపై ప లు కులాల, జాతుల భవనాలు, గుడులు వెలిశాయి. ఇవేకాకుండా చెరువుకు, మునగ నూరుకు మధ్యలో ఉన్న వెంచర్లలో అక్రమ ఎన్వోసీలతో ఇళ్ల నిర్మాణం చేపట్టారన్న ఆరోపణలున్నాయి. వీటన్నింటినీ హైడ్రా అధికా రులు పరిగణనలోకి తీసుకొని, ఈ చెరువును పరిరక్షిస్తారా? అనేది వేచి చూడా ల్సిందే.

 గూడెంకుంట చెరువు మాయం 

ఇంజాపూర్లోని సర్వే నెంబర్లు 98, 99లో సుమారు 16 ఎకరాల విస్తీర్ణంలో గూడెంకుంట చెరువు విస్తరించి ఉంది. ఈ చెరువు కట్టను నామరూపాల్లేకుండా చేసి కొందరు ప్రజాప్రతినిధులు వెంచర్ ఏర్పాటు చేశారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో కొన్నాళ్లపా టు స్తబ్దుగా ఉండి, మూడోకంటికి తెలియకుండా ప్లాట్లను అమ్మేసుకున్నారు. ఇప్పుడు పూర్తిగా ఎఫ్టీఎల్లో ఉన్న ప్లాట్లకు మున్సిపాలిటీ నుంచి బిల్డింగ్ పర్మిషన్ అనుమతులు లభించాయి. ఇదెలా సాధ్యమంటే... అమ్యామ్యాలు తడిపితే ఏదైనా సాధ్యమేనన్నది తేటతెల్లమవుతోంది.

మన్నెగూడలో ఘొల్లుమంటున్న గంగరాయిచెరువు 

మన్నెగూడ రెవెన్యూ పరిధిలో ఉన్న గంగరాయి చెరువులో వెంచర్లు వెలుస్తున్నాయి. దీనిపై ఇప్పటికే హైడ్రాకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. సుమారు ఐదె కరాల విస్తీర్ణంలో ఈ వెంచర్ ఏర్పాటవుతోం ది. అయితే మూడున్నర ఎకరాలకు ఇరిగేషన్ శాఖ నుంచి ఎన్వోసీ తీసుకొని, చెరువు ఎఫ్టీఎల్కు చెందిన మరో ఎకరాన్నర భూమి ని ఈ వెంచర్లో కలిపేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికే చెరువు మొత్తాన్ని వెంచర్ యజమానులు మట్టితో నింపేశారు. దీనిపై హైడ్రాకు ఫిర్యాదులు వెళ్లినా, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నిర్మాణాలు పూర్తయితే చర్యలకు వెనుకాడటంలో అర్థంముంది కానీ, ఎలాం టి కట్టడాలు జరగకుండా, కేవలం చెరువులో నింపిన మట్టిని ఎందుకు తీసివేయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

’గువ్వకుంట, దుబ్బకుంటకనుమరుగు’

తుర్కయంజాల్ రెవెన్యూ పరిధిలోని గువ్వకుంట, దుబ్బకుంట చెరువుల ఊసే వి న్పించడం లేదు. ఆది వెంకటేశ్వరనగర్ ఫేజ్-4 పేరుతో ఓ బడా రియల్టర్ ఏర్పాటు చేసిన ఈ వెంచర్తో గువ్వకుంట, దుబ్బకుంట కాలగమనంలో కనుమరుగైపోయాయి. గువ్వ కుం ట కట్టను తొలగిస్తూ వెంచర్ ఏర్పా టు చేయడంతో కొందరు స్థానికులు గతంలో ఆందో ళన చేపట్టారు. అయితే పెద్ద తలకాయలు ఈవెంచర్లో ఉండటంతో ఆ ఆందోళన ఎన్నా ళ్లో సాగలేదు.

అయితే ఈ వెంచర్ ఏర్పాటు సమయంలో ప్రభుత్వ స్థలాన్ని రో డ్డుగా చూపినట్టు ఆరోపణలున్నాయి. హై డ్రా అధికారులు దృష్టిసారిస్తే ఏవీనగర్ -4కి రోడ్డు బంద్ కావడం ఖాయమంటున్నారు. దుబ్బకుంట విషయంలో దాదాపు ఇదే జరిగినా, పేదల అవసరాలు ఆసరాగా తీసుకు న్న రియల్టర్... వారిని ఏమార్చి దుబ్బకుంట చుట్టూ ప్రహరీ నిర్మించారు. ఇప్పుడు అక్కడ చెరువు ఉండేదా? అనే అనుమానం రాక మానదు. 

’కాపుల్చెరువు ఉనికి కరువు’

శోభానగర్ పైభాగాన ఉన్న కాపుల్చెరువు ఇప్పుడు ఉనికిని కోల్పోయింది. రియల్టర్లు చేసిన అక్రమ వెంచర్లతో ఈ చెరువు కనుమరుగైపోయింది. అయితే ఇప్పటికీ ఈ ప్రాం తంలో రెవెన్యూ, ఇరిగేషన్లో ఎఫ్టీఎల్ వ్బుసైట్లలో ఎఫ్టీఎల్గానే చూపిస్తోంది. ఇప్పుడు ఇదే చెరువు శిఖంలో ఓ వెంచర్ ఏర్పాటుకు ప్ర యత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. శో భానగర్, ద్వారకానగర్లో కొంతమేర విస్తరించిన ఉన్న ఎఫ్టీఎల్లో కొందరు ఇరిగేషన్ శాఖ పేరుతో అక్రమ ఎన్వోసీలు సృష్టించి, అమాయక ప్రజలను మోసం చేస్తున్నారన్న ఆరో పణలున్నాయి.

హైదరాబాద్ మహానగరంలో దూకుడు ప్రదర్శిస్తున్న హైడ్రా తుర్క యంజాల్ మున్సిపాలిటీపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. కేవలం మాసా బ్చెరువు, దిలావర్ఖాన్ చెరువులే కుండా మిగతా చెరువులు, కుంటలపైనా హైడ్రా అధికారులు ఫోకస్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మన్నెగూడలోని గంగరాయిచెరువు లో కొనసాగుతున్న పనులను వెంటనే నిలిపివేయించాలని సూచిస్తున్నారు. చెరువుల ను రక్షించి ప్రజారోగ్య రక్షణకు శ్రీకారం చుట్టాలని, జలకళ, పచ్చదనంతో ఈ ప్రాంతం విలసిల్లాలని విశ్వసిస్తున్నారు.