11-07-2025 12:26:08 AM
జర్నలిస్టులకు సీఎం క్షమాపణ చెప్పాలి: మాజీ ఎమ్మెల్సీ కర్నె
హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): ప్రెస్‌క్లబ్‌ను క్లబ్బులు, పబ్బులు అంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఎగతాళి చేయడాన్ని ఖండిస్తున్నామని, జర్నలిస్టులను అవమానపరిచిన రేవంత్‌రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ డిమాండ్ చేశారు.
గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ.. జర్నలిస్టు సంఘాలు, మేధావులు రేవంత్‌రెడ్డి తీరును ఖండించాలని, జర్నలిస్టులను అవమాన పరిచిన రేవంత్‌పై బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
వెటకారంగా మాట్లాడుతారా?: మాజీమంత్రి నిరంజన్ రెడ్డి
మాక్ అసెంబ్లీ పేరుతో వెటకారం మాటలు సీఎం మాట్లాడుతారా అని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే ఎల్బీ సేడియం, అసెంబ్లీలో చర్చపెట్టాలని కోరారు. కుహానా మేధావులతో కాళేశ్వరంపై పత్రికల్లో పనికిరానిదంటూ వ్యాసాలు రాయిస్తున్నారని, రెండు పిల్లర్లు కుంగితే పునరుద్దకుండా రాద్ధాంతం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రజల చేతిలో ప్రజాస్వామ్య కొరడా దెబ్బలు తినబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని నిరంజన్‌రెడ్డి అన్నారు.