11-07-2025 12:52:12 AM
న్యూఢిల్లీ, జూలై 10: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)ను నిర్వహించాలన్న ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయాన్ని గురువారం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సమర్థించింది. ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టు లో సుధాంషు ధులియా, జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం విచారించింది.
ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. ఓటరు జాబితా సవరణ ప్రక్రి య రాజ్యాంగం ప్రకారమే జరుగుతుందని.. ఈసీ చర్యను అడ్డుకోలేమంటూ కీలక వ్యా ఖ్యలు చేసింది. అయితే ఎన్నికల ముందు ఓటరు జాబితా సవరణ నిర్వహించడాన్ని మాత్రం ప్రశ్నించింది. ఈ ప్రక్రియలో ఎ లాంటి తప్పు లేదని.. అయితే ఇక్కడ సమస్యంతా చేపడుతున్న సమయం.. దాని చెల్లు బాటుతోనే అని ధర్మాసనం పేర్కొంది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక వ్యక్తి ఓటును కోల్పోతే దానికి గురించి అడిగేందుకు సద రు వ్యక్తికి సమయం ఉండదని తెలిపింది. ఒకసారి ఓటర్ల జాబితా ఖరారైన తర్వాత కోర్టులు ఆ అంశం జోలికి వెళ్లవని గుర్తు చేసింది. ఓటు కోల్పోయిన వ్యక్తి ఎన్నికల ముందు సవరించిన జాబితాను సవాలు చేసేందుకు వీలు ఉండదని స్పష్టం చేసింది. ఇలాంటి ప్రక్రియతో మన దేశ పౌరులు కాని వారికి ఆ జాబితాలో చోటు ఉండదని తెలిపింది.
దీనిని ఎన్నికలతో సంబంధం లేకుండా వేరుగా నిర్వహించాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఈసీ ఎదుట మూడు ప్రశ్నలు సంధించింది. ఈ ప్రక్రియ నిర్వహించడానికి ఈసీకి ఉన్న అధికారం.. ఈ సవరణ ప్రక్రియ చెల్లుబాటు.. నిర్వహిస్తున్న సమయంపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు ప్రాథమిక పత్రాలుగా ఆధార్, రేషన్ కార్డుతో పాటు స్వయంగా ఎన్నికల సంఘం జారీ చేసిన ఐడీ కార్డును పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. పౌరసత్వా న్ని నిర్ణయించే అధికారం ఎన్నికల సంఘానికి లేదని స్పష్టం చేసింది.
వెరిఫికేషన్ కోసం పరిశీలించాలనుకుంటున్న 11 పత్రాల్లో ఆధార్, ఓటర్ ఐడీ కార్డులను చేర్చకపోవడం వివాదాస్పదంగా మారింది. ఎన్నికల సం ఘం ప్రస్తావించిన ఆ పత్రాలు సమగ్రంగా లేవని తాజాగా అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఆ తర్వాత తదుపరి విచారణ జూ లై 28కి వాయిదా వేసింది. జూలై 21కి కౌం టర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ఈసీ ని ఆదేశించింది.
పిటిషన్ల వెనుక ‘ఆధార్’ ప్రధాన కారణం
జూన్ 25న బీహార్‌లో ఎన్నికల సంఘం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ స మావేశం తర్వాతే రాజకీయ దుమారం చెలరేగింది. అధికార పార్టీకి అనుకూలంగా ఎన్ని కల సంఘం వ్యహరిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటె న్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ఓటర్ల జాబితా సవరణకు పూనుకుంది. దీన్ని సవాలు చేస్తూ సుప్రీంలో పది పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదనలు వినిపిస్తూ.. అన్ని పిటిషన్ల వెనుక ప్రధాన కారణం ఆధార్ అని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం గుర్తింపు కార్డు (ఈసీఐ)ను గణన పత్రాల జాబితా నుంచి తొలగించడమేనని తెలిపారు. మరో సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి మాట్లాడుతూ.. ఈసీ తీరుతో అర్హత ఉన్న ఓటరు కూడా తన ఓటు హక్కును కోల్పోవడమేనన్నారు.
ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని వ్యాఖ్యానించారు. దాదాపు 20 ఏళ్ల క్రితం ఓటర్ల జాబితా ప్రక్షాళన జరిగింది. ఈ క్రమంలో మరోసారి సవరణలు చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఎన్నికల సంఘం ఎంచుకున్న సమయంపై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన బీహార్‌లోనే తొలుత ఎంచుకోవడం విమర్శలకు తావిస్తోంది.
ముస్లింలు, వలస కార్మికులు, దళితులను ఓటర్ల జాబితా నుంచి మినహాయించేందుకే కేంద్రం కనుసన్నల్లో ఈసీఐ ఈ వ్యూహాన్ని అమలు చేస్తోందని ఇండియా బ్లాక్ కూటమి ఆరోపించింది. అయితే ప్రతిపక్షాల పిటిషన్‌పై స్పందించిన సుప్రీం ఈసీ ప్రక్రియను అడ్డుకోలేమని.. అది రాజ్యాంగబద్ధమేనని పేర్కొనడంతో విపక్షాల వాదనలకు తాత్కాలిక ముగింపు పడినట్లయింది.