11-05-2025 01:57:28 AM
- ప్రకటించిన బీసీ కమిషన్ చైర్మన్ జీ నిరంజన్
హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి): పహల్గాం దుర్ఘటనలో అమాయకులను వారి కుటుంబాల ముందే దారుణంగా హత్య చేసిన దృశ్యాలతో దిగ్భ్రాంతి చెందినట్టు బీసీ కమిషన్ చైర్మన్ జీ నిరంజన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
మన సైన్యం ఉగ్రవాదులను అంతం చేయాలని దేశమంతా కోరుకుంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జాతీయ రక్షణ నిధికి తన ఒకనెల జీతాన్ని నిరంజన్ ప్రకటించారు. సైన్యం దేశ ప్రజల మనోభావాలను గౌరవించి ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఉగ్రవాదులపై చర్యలను ప్రారంభించిందని వివరించారు. జాతీయ రక్షణనిధికి విరాళాలు, ఇతర అన్నిమార్గాల ద్వారా మన సైన్యానికి మద్దతుగా నిలబడటం ప్రతీ పౌరుడి విధి అని పిలుపునిచ్చారు.