calender_icon.png 11 May, 2025 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోహింగ్యాలను వెంటనే తిప్పిపంపండి

11-05-2025 01:56:05 AM

- సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ

హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి): తెలంగాణలో ముఖ్యంగా హైద రాబాద్ ఓల్డ్ సిటీలో ఎలాంటి అనుమతులు, పత్రాలు లేకుండా అక్రమంగా నివసిస్తున్న పాకిస్థాన్, బంగ్లాదేశ్, రో హింగ్యాలపై చర్యలు తీసుకోవాలని, వెం టనే వారిని దేశం నుంచి తిప్పిపంపించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాం డ్ చేశారు.

ఈ మేరకు శనివారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ఓవైపు పాకిస్తాన్ మన దేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతూ అమాయక ప్రజల ప్రాణా లు తీస్తోందని..ఇలాంటి సమయంలో దేశ భద్రత విషయంలో రాజీ పడవద్దని సీఎంను కోరారు. చొరబాటుదారులను తరిమికొడితే తప్ప భద్రత సాధ్యం కాదన్నారు. తెలంగాణ నుంచి చొరబాటుదా రులను తరిమికొట్టాలని కోరారు.