21 March, 2026 | 7:13 PM

Breaking News

మున్సిపాలిటీలోని రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంచాలి   •   అభివృద్ది పనులను పరిశీలించిన ఎంఎల్ఏ   •   ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర   •   అంజనాద్రిని దర్శించుకున్న పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు   •   నిర్మల్ బుద్ధ విహార్‌లో 6వ రోజు కొనసాగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భీమ్ జ్ఞాన దీక్షలు   •   కామారెడ్డి డిక్లరేషన్ కు కార్యరూపం ఎప్పుడూ...?   •   టీజీ ఆర్టీసీ ఆధ్వర్యంలో కాశీ అయోధ్యకు బస్సు సర్వీసు   •   గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు సాధించాం   •   కుల మతాల కతీతంగా మతసామరస్యానికి ప్రతీక రంజాన్   •   ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి   •  

హనుమాన్ ఆలయ విగ్రహానికి 60 వేల విరాళం

21-03-2026 03:53 PM

మాజీ కౌన్సిలర్ కన్నయ్య అందజేత

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి లోని అతి పురాతనమైన కోడూరి హనుమాన్ ఆలయ నిర్మాణం లో భాగంగా మాజీ కౌన్సిలర్ కోయల్కర్ కన్నయ్య 60 వేల విరాళాన్ని శనివారం అందజేశారు. షబ్బీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తన సొంత డబ్బులను షబ్బీర్ కు అందజేసి హనుమాన్ విగ్రహానికి ఏర్పాటుకు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు అందజేశారు. గుడి నిర్మాణంలో ఉన్నందున ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహకరించాలని ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు పండ్ల రాజు, కారంగుల అశోక్ రెడ్డి, నిమ్మ మోహన్ రెడ్డి, ప్రతిభ రమేష్, పిల్లి మల్లేష్, రెడ్డి నరేష్ రెడ్డి, బొజ్జ రవి, ధర్మరాజు లు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చింతల శ్రీనివాస్ గొడుగుల శ్రీనివాస్, సత్యం తదితరులు పాల్గొన్నారు.