calender_icon.png 11 July, 2025 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లన్న క్షేత్రంలో సత్రం నిర్మాణానికి విరాళం

23-06-2025 12:00:00 AM

చేర్యాల, జూన్ 22 ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం నందు నిర్మించ తలపెట్టిన 100 గదుల సత్రం కోసం దేవాదాయ శాఖ విరాళాలు సేకరిస్తున్న సంగతి విధితమే. దేవాలయం వారు చేపట్టిన విరాళాల సేకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. ఇప్పటికే పలువురు స్పందించి సత్రాల నిర్మాణానికి విరాళాలు అందజేస్తున్నారు.

అందులో భాగంగానే హైదరాబాదు కు చెందిన డాక్టర్ బొద్దుల రామన్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి, స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం మల్లన్న క్షేత్రంలో సత్రాల నిర్మాణాల విషయం తెలుసుకున్న ఆయన అప్పటికప్పుడు స్పందించి 15 లక్షలు చెక్కును ఆలయ కార్య నిర్వహణ అధికారి అన్నపూర్ణకు అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు ప్రసాదంతో పాటు స్వామివారికి చిత్రపటం, శేష వస్త్రాన్ని అందజేశారు.

భక్తులకు అభిషేక జలాల  సంప్రోశణ

ఇంతకుముందు స్వామివారిని దర్శించుకునే భక్తులకు స్వామివారి దర్శనానంతరం అర్చకులు బండారి బొట్టు మాత్రమే ను పెట్టేవారు. కానీ ఇటీవల దేవాదాయ శాఖ తీసుకున్న నిర్ణయం మేరకు ఇకనుంచి స్వామివారి అభిషేక జలాలను అర్చకులు భక్తుల తల తలపై చల్లుతారు.

అదేవిధంగా అఖండ హారతిని కూడా ఇవ్వనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి అన్నపూర్ణ తెలిపారు. ఈ కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్, పడగన్న గారి మల్లేషం ఆధ్వర్యంలో ఈవో తో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.