11-07-2025 10:39:38 AM
తిరుమల: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రజలు సనాతన ధర్మం కోసం కలిసికట్టుగా ఉండాలని ప్రార్థించానని బండి సంజయ్ పేర్కొన్నారు. ధూప దీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలను టీటీడీ రక్షించాలని బండి సంజయ్ కోరారు. పురాతన ఆలయాలను గుర్తించి అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని చెప్పారు. కొండగట్టు అంజన్న క్షేత్రం, కరీంనగర్ రామాలయాలు, వేములవాడ, ఇల్లంతకుంట రామాలయాల అభివృద్ధి చేయాలని టీటీడీ ఛైర్మన్(TTD Chairman)కు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
టీటీడీలో వెయ్యి మందికి పైగా ఉద్యోగులు అన్య మతస్థులు ఉన్నారని బండి సంజయ్ ఆరోపించారు. అన్ని మతాలకు టీటీడీ సత్రం కాదన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగం ఉన్నవారిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. టీటీడీ ఎవరి ఆస్తి కాదు.. హిందువులది మాత్రమే అన్నారు. ఎర్రచందనం(Red Sandalwood Smuggling) దోచేసిన దొంగలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని బండి సంజయ్(Bandi Sanjay) హెచ్చరించారు. వీరప్పన్ వారసులను చట్టం ముందు నిలబెడతామన్నారు. స్వామివారిని అడ్డుపెట్టుకుని వ్యక్తిగత ఆస్తులు పోగేసిన వారి పాలన పోయింది.. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సేవకుల పాలన వచ్చిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.