23-06-2025 12:00:00 AM
కన్నీరు మున్నీరైన కుటుంబ సభ్యులు
కరీంనగర్ క్రైం,జూన్ 22.(విజయక్రాంతి):కరీంనగర్ పట్టణంలోని కశ్మీర్ గడ్డకు చెందిన ఖాజా మెహరాజ్ (46) అనే వ్యక్తి మృతదేహం ఆదివారం కరీంనగర్ కు చేరింది. ఈనెల 16న గల్ఫ్ దేశం షార్జా లో మెహరాజ్ మృతి చెందాడు.
మెహరాజ్ ఖాజా గత 8 సంవత్సరాలుగా షార్జా లో ఉంటూ అల్ ఖైరిన్ బాయ్స్ పాఠశాలలో ప్రొఫెసర్ గా ఉంటూ విద్యార్థులకు విద్యను బోధించేవాడు. అకాల మృతి పట్ల గత వారం రోజులుగా మృత దేహం కొరకు కుటుంబ సభ్యులు వేచి చూశారు.
మృతుని భార్య హసీనా సుల్తానా, బావమరిది ఆజర్ పా ష మరియు అక్క కుమారుడు ఫైజాన్ అహ్మద్ సిద్ధికి, షార్జాకు వెళ్లి అక్కడ షార్జా లోని బంధువుల సహకారం తీసుకొని అక్కడ కార్యక్రమాలు పూర్తి చేసి భారతదేశానికి ఆదివారం ఉదయం నాలుగు గంటల సమయంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కు మృతదేహం చేరింది. అనంతరం కరీంనగర్ కు ఉదయం 11 గంటలకు మృతదేహం ఇంటికి చేరింది. కుటుంబ సభ్యుల రోదనలుమిన్నంటాయి..