07-10-2025 12:22:13 AM
- విజృంభిస్తున్న దోమలు
-తీవ్ర అనారోగ్యానికి గురవుతున్న పట్టణవాసులు
- పట్టించుకోని మున్సిపల్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు
నాగర్ కర్నూల్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ పట్టణంలోని అనేక ప్రాంతాల్లో ఇళ్ళ ముందు ఖాళీ స్థలాల్లో ము రుగునీరు, చెత్త పేరుకుపోవడంతో చిన్న చి న్న మురుగు కుంటలు ఏర్పడ్డాయి. ఇవి దో మల పెరుగుదలకు ఆవాసాలుగా మారి ప్ర జలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. మురుగు నీటి నిల్వ కారణంగా దోమలు వి స్తరించి ఇళ్లలోకి దండెత్తుతుండగా, దగ్గు, జ లుబు, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు పెరుగుతున్నాయని పట్టణవాసు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి శుక్రవారం డ్రై డే పేరుతో కార్యక్రమాలు నిర్వహి స్తున్నామని చెప్పుకునే వైద్య ఆరోగ్యశాఖ అ ధికారులు మాత్రం ఆచరణలో విఫలమవుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ అధికారులు కూడా ఖాళీ స్థలా ల్లో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలను శుభ్రం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.వరుస వర్షాల కారణంగా మురుగు నీటితోపాటు వర్షపు నీరు నిలిచి కుంటలుగా మారడంతో పందులు కు క్కలు స్త్వ్రర విహారం చేయడంతో దుర్వాసన వ్యాప్తి చెందుతుందని, తక్షణ చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు అధికారులను కో రుతున్నారు.
తరచూ ఫాగింగ్ చేసి దోమలను నియంత్రించాల్సిన అవసరం ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రతి ఇంట్లో ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు వ్యాధుల బారినపడుతున్నారని స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఖాళీ స్థల యజ మానుల నుండి పన్నులు వసూలు చేస్తాం. నాగర్ కర్నూల్ మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డులో చెత్త సేకరణ నిర్విరామంగా కొనసాగుతోంది అక్కడక్కడ స్థల యజమానులు నిర్లక్ష్యం చాలాకాలంగా పిచ్చి మొక్కలు పెరిగిన కారణంగా వర్షపు నీరు దగ్గరలోని ఇళ్ల నుండి వచ్చిన వ్యర్ధాలు చేరి దోమల వ్యాప్తికి కారణం అవుతున్నాయి. వాటిని నిలువరించడంతోపాటు ఖాళీ స్థల యజమానుల నుండి పన్నులు వసూలు చేసి వాటిని శు భ్రం చేసే పనులు చేపడతాం. నాగిరెడ్డి, ము న్సిపల్ కమిషనర్,నాగర్‌కర్నూల్.