15 June, 2026 | 7:18 PM

Breaking News

అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •  

హామీ ప్రకారం పెళ్లికి రూ. 5000 విరాళం

23-02-2026 12:58 AM

నాగిరెడ్డిపేట్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): సర్పంచ్ ఎన్నికల్లో హామీలో భాగంగా ఐదువేల రూపాయలు పెళ్లికి అందజేసినట్లు వదల్పర్తి గ్రామ సర్పంచ్ సత్యబోయిన పద్మ నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వదలపర్తి గ్రామ సర్పంచ్ సత్యబోయిన పద్మా నారాయణ మాట్లాడుతూ... మండలంలోని వదలపర్తి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా గ్రామంలోనీ ఏ ఇంటిలోనైనా ఆడ కూతురుకు పెళ్లి జరిగితే 5000 రూపాయలు ఇస్తానని చెప్పిన హామీ ప్రకారం చాకలి సాయిలు కూతురు పెళ్లికి 5000 రూపాయలు కట్నం ఇవ్వడం జరిగిందని గ్రామ సర్పంచ్ సత్యబోయిన పద్మ నారాయణ తెలిపారు.

దీనితో గ్రామంలో అందరూ ఐదువేల రూపాయలు పెళ్లికి ఇవ్వడంతో ఆశ్చర్యానికిలోనై అభివందనాలు తెలియజేశారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఎందరో గెలవాలని మాట ఇచ్చి తప్పుతారు తప్ప ఇలా మాట మీద ఉండి పెళ్లికి 5000 రూపాయలు ఇవ్వడం ఎంతో గొప్ప అని గ్రామస్తులు తెలిపారు. ఇలాగే సమాజంలో అందరూ ఉంటే ప్రజాస్వామ్యంతో పాటు ప్రజలు ఎందరో బాగుపడతారన్నారు.వదలపర్తి సర్పంచ్ సత్యబోయిన పద్మ నారాయణను అందరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సత్యబోయిన పద్మ నారాయణ,గ్రామస్తులు పాల్గొన్నారు.