17-07-2025 05:40:56 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ పట్టణ కేంద్రానికి చెందిన ప్రముఖ కవి రెబ్బ మల్లికార్జున్ వలిగొండ శాఖా గ్రంథాలయానికి పుస్తకాలను గురువారం విరాళంగా అందజేశారు. రెబ్బ మల్లికార్జున్ రచించి, ఇటీవల ఆవిష్కరించిన పుస్తకం పద్మశ్రీ పురస్కార గ్రహీత ఆచార్య డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య జీవితచరిత్ర తోపాటు, ఇతర తెలుగు సాహిత్య పుస్తకాలను గ్రంథాపాలకుడు పిట్టల ఆంజనేయులుకు అందజేశారు. కవి రెబ్బ మల్లికార్జున్ మాట్లాడుతూ ఈ పుస్తకాలు పలుపోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు, పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులకు ఎంతగానో దోహదపడతాయని ఈ సదావకాశాన్ని అందరూ వినియోగించుకోవలసిందిగా కోరారు.