17-07-2025 10:53:34 PM
జడ్చర్ల మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి
జడ్చర్ల: దైవభక్తి ప్రతి ఒక్కరిని సన్మార్గంలో నడిపిస్తుందని మాజీ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం జడ్చర్ల పట్టణంలోని ఉరెస్- ఈ- షరీఫ్ దర్గా వద్ద జరిగిన సయ్యద్ మహబత్- అలీ- షా-ఉర్సు కార్యక్రమంలో మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అందరూ సుఖసంతోషాలతో జీవనం కొనసాగించాలని కోరారు. కుల మతాలకు అతీతంగా పండుగలను జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.