17-07-2025 10:47:56 PM
కుభీర్,(విజయక్రాంతి): కుభీర్ మండలంలోని పల్సి గ్రామంలోని విద్యా భారతి పాఠశాలలో గురువారం విద్యార్థులు, ఉపాధ్యాయులు అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముందుగా పాఠశాల నుండి శోభాయాత్రగా వెళ్లి గజ్జలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి బోనాలను సమర్పించారు. అనంతరం పాఠశాల కు చేరుకుని విద్యార్థులు ఉపాధ్యాయులు కోలాటంతో పాటు అమ్మవారి వేషధారణలో అందరినీ అలరించారు. ఈ సందర్భంగా హెచ్ఎం డోలెవార్ పోతున్న, పాఠశాల సిబ్బంది ఉన్నారు.