17-07-2025 10:58:34 PM
మేడిపల్లి: ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జనగాం జిల్లా, చేడూర్ గ్రామానికి చెందిన ఇనుముల మల్లయ్య ఫిర్యాదు మేరకు తన కుమారుడు ఇనుముల శ్రీనివాస్ (40), అతని భార్య విక్టోరియా ఇద్దరు బతుకు దెరువు కోసం ఐదు నెలల క్రితం బోడుప్పల్ లోని ఆర్ ఎన్ ఎస్ కాలనీ కి వచ్చి అద్దెకు ఉంటున్నారు. గత రెండు, మూడు రోజుల నుంచి వారు కనబడకపోవడంతో ఇంటి ఓనర్ రాజేష్ తండ్రి మల్లయ్యకు ఫోన్ చేశాడు. వెంటనే తాను బోడుప్పల్ కు వచ్చి చూసేసరికి తన కొడుకు ఇంట్లో వెంటిలేటర్ కు చున్నీతో ఉరి వేసుకుని చనిపోయి కనిపించాడు. తండ్రి మేడిపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ గోవిందరెడ్డి తెలిపారు.