calender_icon.png 18 July, 2025 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాలలకు రోస్టర్ పాయింట్ ను మార్చాలి

17-07-2025 10:56:26 PM

మాల సంఘాల జెఏసి రాష్ట్ర  చైర్మన్ మందాల భాస్కర్

సూర్యాపేట,(విజయక్రాంతి): మాలలకు రోస్టర్ పాయింట్ సంఖ్యను ఏడు కు మార్చాలని, మాలలు ఓట్లు వేసి గెలిపిస్తే ఇచ్చే  బహుమానం ఇదేనా అని మాల సంఘాల జెఏసి రాష్ట్ర చైర్మన్ మందాల భాస్కర్ అన్నారు. మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో గురువారం ఎస్సీ కమ్యూనిటీ హాల్లో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సుమారు రాష్ట్రంలో సుమారు 36 లక్షలు ఉన్న మాలల సామాజిక వర్గానికి రోస్టర్ పాయింట్  22 కేటాయించడం విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్  లు దక్కకుండా చేయడం అన్యాయమన్నారు. దీనిని మాల సంఘాల జేఏసీ వ్యతిరేకిస్తుందన్నారు. మాలలకు రోస్టర్ పాయింట్లను తగ్గించకుంటే   స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.