6 May, 2026 | 1:56 AM

శివాలయ నిర్మాణానికి రూ.55 వేల విరాళం అందజేత

06-05-2026 12:00 AM

మొయినాబాద్ మే 5(విజయ క్రాంతి): మొయినాబాద్ మండలంలోని చాకలిగూడ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయానికి స్థానికులు విరాళాలు అందజేస్తూ భక్తి భావాన్ని చాటుతున్నారు.ఈ సందర్భంగా మండల బీఆర్‌ఎస్ యూత్ కోశాధికారి, కేతిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ 10వ వార్డ్ సభ్యుడు రేనట్ల సుధాకర్ గౌడ్, ఆయన సోదరులు మాధవ్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్ తమ తండ్రి రేనట్ల సంగమయ్య గౌడ్ చేతుల మీదుగా రూ.55,000 విరాళంగా అందజేశారు.

ఈ పుణ్య కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఆర్. రాజు గౌడ్, కావలి వెంకటేష్, పెద్దబాయి లక్ష్మయ్య, కావలి రమేష్, దగ్గుల కుమార్, కమ్మేట చిన్న మల్లేష్, కమ్మేట కుమార్, ఆర్. రజనీకాంత్ గౌడ్, ఆర్. శ్రీనివాస్ గౌడ్, కావలి రవి పాల్గొన్నారు.అదేవిధంగా గ్రామ పెద్దలు, మాజీ వార్డు సభ్యులు కావలి చంద్రయ్య, కమ్మేట మల్లేష్, ఆర్. పెంటయ్య గౌడ్, ఆర్. దర్శన్ గౌడ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా ప్రజలు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.