17 August, 2026 | 6:10 PM

నిజమైన అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి

17-08-2026 05:07 PM

ఆప్ జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్

ప్రజావాణిలో కలెక్టర్ కు వినతి 

భూపాలపల్లి టౌన్, ఆగస్టు 17 (విజయక్రాంతి): నిజమైన అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ అన్నారు. ఈ మేరకు సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల్లో అర్హులు కాని వారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు.

కొన్ని మండలాల్లో కొంతమంది దళారులు ప్రజల దగ్గర నుంచి  డబ్బులు తీసుకొని  ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేపిస్తున్నారుని ఆరోపించారు. అటువంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో ఇల్లు లేక చాలామంది పేదలు గుడారాలు వేసుకొని, కిరాయిలు ఉంటూ చాలామంది జీవితాన్ని గడుపుతున్నారని అలాంటి వారిని గుర్తించి ఇండ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ భూపాలపల్లి మండల అధ్యక్షుడు జాడి నితిన్  పాల్గొన్నారు.