28 March, 2026 | 2:28 AM

బిల్లులు అడగవద్దు.. మా దగ్గర లేవు..

28-03-2026 12:17 AM
  1. ఆయీ మాత హార్డ్‌వేర్ ఎలక్ట్రికల్ దుకాణం నిర్వాహకుల నిర్లక్ష్యం 

వినియోదారులు అడిగినా ఇవ్వని బిల్లులు 

అడ్డాకుల మార్చి 27 : వస్తువు ఏదైనా వినియోగదారుడు అడిగిన వెంటనే బిల్లు ఇవ్వవలసిన బాధ్యత సంబంధిత షాప్ ని ర్వాహకులకు ఉంటుంది.  మండల కేంద్రం లో ఆయీ మాత హార్డ్వేర్ ఎలక్ట్రిషన్ షాప్ యజమాని  కస్టమర్ కు ఎలాంటి బిల్లులు ఇవ్వకుండానే ఎలక్ట్రికల్ సామాన్, హార్డ్వేర్ తోపాటు తదితర వస్తువులను విక్రయిస్తూ వినియోగదారుడు బిల్లు అడుగుతున్నప్పటికీ మా దగ్గర బిల్లులు లేవు అంటూ నిర్ల క్ష్యంగా సమాధానం ఇస్తున్నారని వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తుండ్రు. 

షాపులో బిల్లు ఇవ్వకుండా (GST తప్పించుకోవడానికి) బిల్స్ ఇవ్వకుండా తన కొటేషన్ పేపర్‌తో  లేదా ఒక పేపర్లో రాసి ఇదే బిళ్ళని చెబుతున్నారని పలు విమర్శలకు తావిస్తోంది. షాపులో నాణ్యత లేని వస్తువులు  అమ్మి ప్రజలను మోసం చేస్తున్నారని,  మళ్లీ  రిటర్న్ విషయంలో తీరు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వినియోగదారులు చెబుతున్నారు.  నా దగ్గర బిల్లు లేదు ఈ విధంగానే అమ్ముతానని సమాధానం చెబుతున్నాడు. ఇట్టి షాపు యజమానిపై సంబంధిత అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు  కోరుతున్నారు.