calender_icon.png 22 October, 2025 | 1:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధైర్యపడకండి

22-10-2025 02:12:28 AM

-మృతుడు ప్రమోద్ కుటుంబానికి డీజీపీ భరోసా

-నిజమాబాద్ వెళ్లి మృతుడి కుటుంబానికి పరామర్శ

-ప్రభుత్వం రూ.కోటి పరిహారం, 300 గజాల స్థలం ఇస్తుందని ప్రకటన

-ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆసిఫ్‌కూ భరోసా

-వైద్యఖర్చులు ప్రభుత్వ భరిస్తుందని హామీ 

-డీజీపీ మృతుడి కుటుంబానికి పరామర్శ

నిజామాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): ‘మీరు అధైర్య పడకండి.. మీకు రాష్ట్రప్రభుత్వం, పోలీస్‌శాఖ అన్ని విధాలుగా అండగా ఉంటుంది’ అని డీజీపీ శివధర్‌రెడ్డి భరోసానిచ్చారు. ఆగంతకుడు రియాజ్ కత్తితో చేసిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్‌కుమార్ కుటుంబాన్ని పరామర్శించారు. మంగళవారం ఈమేరకు మల్టీ జోన్ ఐజీ ఎస్. చంద్రశేఖర్‌రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి నిజామాబాద్‌లోని మృతుడి నివాసానికి విచ్చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచన మేరకు తాను నిజామాబాద్ వచ్చానని తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభు త్వం రూ.కోటి ఎక్స్‌గ్రేషియాతోపాటు 300 గజాల ఇంటి స్థలం అందిస్తుందని తెలిపారు. అలాగే కుటుంబానికి పెన్షన్, కుటుం బంలో ఒకరికి ఉద్యోగమిస్తుందని వివరించారు. ప్రభుత్వ పరంగా, పోలీస్‌శాఖ తరఫున ఎల్లప్పుడూ కుటుంబానికి సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు.

అమర వీరుల కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ

నిజామాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి డీజీపీ శివధర్‌రెడ్డి, తొమ్మిది పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. జిల్లాలో 1989 నుంచి ఇప్పటివరకు 18 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారని, వీరిలో తొమ్మిది కుటుంబాలకు ఇందల్వాయి మండలం గన్నారం శివారులో 300 గజాల చొప్పున స్థలాలు అందించామని వివరించారు. సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ప్రాణా లు త్యాగం చేసిన పోలీసులు, వారి కుటుంబాలకు అండగా ఉంటుందని భరోసానిచ్చా రు. అంతకుముందు సుభాష్‌నగర్‌లోని పోలీస్ విశ్రాంతి గృహానికి చేరుకున్న డీజీపీ శివధర్‌రెడ్డిని మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్కలు ఇచ్చి స్వాగతం పలికారు.

ఆసిఫ్‌కు హోంగార్డ్ ఉద్యోగమివ్వాలి: ఎమ్మెల్యే భూపతిరెడ్డి 

నిందితుడిని పట్టుకునేందుకు ప్రాణాలకు తెగించి పోరాడి గాయాల పాలైన సయ్యద్ ఆసిఫ్ కోలుకున్న తర్వాత, అతడికి పోలీస్‌శాఖలో హోంగార్డ్ ఉద్యోగం ఇప్పించాలని డీజీపీ శివధర్‌రెడ్డిని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి కోరారు. ప్రతిపాదనపై డీజీపీ సానుకూలంగా స్పం దించా రు. పోలీస్‌శాఖ పరిధిలో హోంగార్డు పో స్టుల భర్తీకి త్వరలోనే రాష్ట్రప్రభుత్వం నోటిఫికేషన్ వెలువరించనుందని, ఆ తర్వాత ఆసిఫ్‌కు హోంగార్డు కొలువు ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

క్షతగాత్రుడు ఆసిఫ్‌కు పరామర్శ

నిందితుడు రియాజ్ పట్టుకునేందుకు పోరాడి, తీవ్రంగా గాయపడి హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందు తున్న సయ్యద్ ఆసిఫ్‌ను మంగళవారం డీజీపీ శివధర్‌రెడ్డి పరామర్శించారు. ఆసిఫ్‌కు అందుతున్న చికిత్సపై వైద్యులను ఆరా తీశారు. ఆసిఫ్ ఆసుపత్రిలో చేరినప్పుడు పరిస్థితి విషమంగా ఉండేదని, తాము సరైన చికిత్స అందించి, శస్త్రచికిత్స చేసి తన ప్రాణా లు కాపాడమని వైద్యులు సమాధానమిచ్చారు. ఏమాత్రం అధైర్యపడొద్దని, పోలీస్ శాఖ అన్ని విధాలా అండగా ఉంటుందని బాధిత కుటుంబానికి డీజీపీ భరోసానిచ్చారు.

ఆసిఫ్ వైద్యానికయ్యే ఖర్చు మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. డిశ్చార్జ్ అయిన తర్వాత విశ్రాంతి తీసుకోవాలని, ఏ విధమైన అవసరమొచ్చినా పోలీసులను సంప్రదించవచ్చని సూచించారు. వెల్డింగ్ పని చేసుకుంటూ కుటుం బాన్ని పోషించుకునే ఒక సాధారణ వ్యక్తి ప్రాణాలకు తెగించి హంతకుడితో పోరాడటం సాహసోపేత చర్య అని కొనియా డారు. తెలంగాణ పోలీస్‌శాఖ ఆసిఫ్‌కు శౌర పథకానికి సిఫార్సు చేస్తుందని స్పష్టం చేశారు. డీజీపీ వెంట శాంతిభద్రతల అడిషనల్ డీజీపీ మహేష్ ఎం భగవత్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఉన్నారు.