calender_icon.png 22 October, 2025 | 4:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

25తో ముగియనున్న తెలంగాణ రైజింగ్-2047 సర్వే

22-10-2025 02:11:39 AM

 ప్రజల నుంచి విశేష స్పందన 

హైదరాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి) : 2047 నాటికి తెలంగాణ రాష్ర్టం ఎలా ఉండాలో ప్రజల నుంచి తగు సలహాలు, సూచనలు చేయడానికి రాష్ర్ట ప్రభుత్వం తెలంగాణ రైజింగ్-2047 సిటిజన్ సర్వేను చేపట్టింది. ఈ ఆన్‌లైన్ సర్వే అక్టోబర్ 25తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రతి పౌరుడు <www.telang ana.gov.in/telanganarising> అనే వెబ్‌సైట్‌ను సందర్శించి  సలహాలు, సూచనలు అందించాలని ప్రభుత్వం కోరింది. ఈ సర్వేకు ప్రజలనుంచి విశేష స్పందన లభిస్తోందని, ఇప్పటి వరకు దాదాపు 3లక్షలకు పైగా పౌరులు పాల్గొన్నారని పేర్కొంది.