calender_icon.png 22 October, 2025 | 2:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూడైస్‌లో పేరుంటేనే పరీక్షలు

22-10-2025 02:13:42 AM

అపార్ ఐడీ పొందిన విద్యార్థులు 64 శాతం

హైదరాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్)లో విద్యార్థుల పేరు ఉంటేనే వార్షిక పరీక్షలు రాసేందుకు అవకాశం ఉంటుందని పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. యూడైస్‌లో పేరు నమో దు తప్పనిసరిగా ఉండేలా పాఠశాలల యాజమాన్యాలు సరి చూసుకోవాలని సూచించారు. ఈ విధానం ప్రస్తుతం పదో తరగతిలో అమల వుతోంది. ఇంటర్‌లోనూ దీన్ని అమలు చేసేందుకు అధికారులు యోచిస్టున్నట్లు తెలిసింది.

కొంత మంది విద్యార్థులు పాఠశాలలకు వస్తు న్నప్పటికీ వారి పేరు యూడైస్‌లో నమోదు కావడంలేదని అధికారుల దృష్టికి వచ్చినట్లు తెలిసింది. ప్రతి విద్యార్థి యూడైస్‌లో నమోదై ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. యూడైస్‌లో పేరు నమోదైతే ఆ విద్యార్థికి పెన్ (పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్) నంబర్ జారీ అవుతోంది.

ఆ తర్వాత అపార్ (ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌం ట్ రిజిస్ట్రీ) ఐడీ జనరేట్ అవుతోందని అధికారి తెలిపారు. దీనిద్వారా విద్యార్థుల సమాచారం డీజీ లాకర్‌లో పొందుపర్చే వీలుంటోందని, ఇప్పటి వరకు రాష్ట్రంలో 64 శాతం మంది అపార్ ఐడీ పొందారని పేర్కొన్నారు.